రాజకీయాల్లో తన వారసుడి ని ఈపాటికే ఖరారు చేసిన పోచారం తనయుడు భవిష్యత్తు రాజకీయ అవసరాలకోసమే పార్టీ మార్చేశారానే చర్చ ఆయన సన్నిహిత వర్గాల్లో ఉంది. తనయుడు రూట్ క్లియర్ గా ఉండలనే పోచారం పార్టీ మార్చేయడానికి సిద్ధం అయ్యారని చెప్తున్నారు.ఎమ్మెల్యే గా ఉన్న అధికారం లేక పొతే ఎదురయ్యే అనేక ప్రతికూల పరిస్థితులు అధిగమించడం దుసాధ్యం గా భావించే అధికార పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారనే వాదన ఉంది.
మరో వైపు ఆయన చేరిక అధికార పార్టీ లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తాము పోరాటం చేస్తున్న పోచారం ను పార్టీలోకి చేర్చుకోవడంను సీనియర్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
గత పదేళ్ల బిఆర్ యస్ పాలన లో ఉమ్మడి జిల్లాలో నే పాలనా వ్యవహారాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీలో కెసిఆర్ ఫ్యామిలీ తర్వాత ఆయనే అన్నట్లుగా పెత్తనం సాగించారు. తండ్రి అధికారనీడలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తనయులు ఈ పదేళ్ల కాలం లో ఆర్థికంగా, రాజకీయంగా పటిష్టంఅయ్యారు.
అందుకే మొన్నటి ఎన్నికల్లో నే తండ్రి స్థానంలో తానే ఎమ్మెల్యే పోటీ చేయడానికి భాస్కర్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు కానీ అధినేత కెసిఆర్ అడ్డు పడ్డారు.చివరికి ఎంపీ టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. దీనితో తండ్రి బిఆర్ యస్ ను వీడేలా తనయుడే ఒత్తిడి చేసారని ప్రచారం జరుగుతుంది .
గులాబీ బాస్ కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న పోచారం అకస్మాత్తుగా పార్టీ మారడం తీవ్ర కలకలం రేపింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో.. తన తనయుడు మాజీ డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, మరో తనయుడు సురేందర్ రెడ్డితో సహా కాంగ్రెస్ లో చేరారు.
బీఆర్ఎస్ సీనియర్ నేతగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది. కొడుకు భాస్కర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసమే పెద్దాయన పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది.
కొడుకు రాజకీయ భవిష్యత్తుతో పాటు తన హయాంలో మంజూరైన సిద్దాపూర్, జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడం, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడం కారణంగా చెబుతున్నారు.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ అనుభవం, వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్ధవంతుడైన శాసనసభాపతి గా గుర్తింపు ఉన్న పోచారం పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు.
1978లో దేశాయిపేట సింగిల్ విడో చైర్మన్ గా తన రాజకీయ ప్రస్దానం మొదలుపెట్టిన పోచారం 1984లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించడంతో ఆ పార్టీలో చేరారు. 1987 లో డీసీసీబీ ఛైర్మన్ అయ్యారు. 1989లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు.
1994లో తొలిసారి బాన్సువాడ అసెంబ్లీ స్దానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లో రెండోసారి గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓటమి పాలై, 2009లో తిరిగి బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆరెస్ లో చేరారు. అనంతరం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఐదో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
2018 ఎన్నికల్లో 6వ సారి గెలిచి అసెంబ్లీ స్పీకర్ గా అందరిని మెప్పించారు. స్పీకర్ గా పనిచేసిన వారు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు లేవనే సెంటిమెంట్ ను అధిగమించి 2023లో ఏడో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వయానా కేసీఆర్ చేత లక్ష్మీ పుత్రుడు, తమ పార్టీకి భీముడు అని పిలిపించుకున్న పోచారం ఆ అధినేతకు హ్యాండిచ్చి హస్తం గూటికి చేరడం కలకలం సృష్టించింది.
పోచారంకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇటు కుమారుడు, డీసీసీసీ మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డికి వచ్చే ఎన్నిక్లలో ఎమ్మెల్యే టికట్ ఖాయం చేశారట.
పెండింగ్ బిల్లులు మంజూరుకు పచ్చ జండా ఊపారట సీఎం రేవంత్.. ఇలా నియోజకవర్గ అభివృద్ది, కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం త్యాగం చేశారనే టాక్ నడుస్తోంది.
వాయిస్ :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో పోచారం ఎఫెక్ట్ బాగానే పడింది. ఆయన కాంగ్రెస్ లో చేరడం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అలజడి సృష్టించింది. ఆయన చేరికను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నియోజకవర్గ నేత బాలరాజు వ్యతిరేకిస్తున్నారు.
పోచారం చేరికను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. కామారెడ్డికి చెందిన మరో ముఖ్య నేత కూడా కలవర పడుతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే తన ప్రతిష్ట తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఆయన వెంట వచ్చే గులాబీ నేతల ఆధిపత్యం పెరిగి తమ ప్రాధాన్యత తగ్గుతుందేమోనని భయ పడుతున్నారు. …