కామారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం ఉదయం ఈ ఘటన చోటచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు.కామారెడ్డి జిల్లాలోని క్యాసంపల్లీ గ్రామ శివారులోని 44జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ఢీ కొట్టింది.
ఈ ఘటనలో అప్సర్ ఖాన్(25) అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మరో ఇరవై ఎనిమిది మందికి తీవ్రా గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు.
ఘటన స్థలంలో ఉన్న స్థానికులు హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరిశీలించారు.పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
