ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిపాలన భవనంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు .
ఈ సందర్భంగా పంచ రెడ్డి చరణ్ గారు మాట్లాడుతూ షబ్బీర్ అలీ సార్ గారు ఎన్ ఎస్ యు ఐ నుండి కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఎదిగిన షబ్బీర్ అలీ సార్ గారి ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ముఖ్యంగా నేటి యువతరానికి ఆయన నాయకత్వం పాఠాలు స్ఫూర్తి అని ఆయన అన్నారు.
31 ఏళ్లకే చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో విద్యుత్, బొగ్గు, మైనారిటీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పని పనిచేసి ఆయా శాఖల అభివృద్ధి పై చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి నిజామాబాద్ ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని చరణ్ పేర్కొన్నారు.
ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన షబ్బీర్ అలీ మరో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయ గౌడ్ ,భాస్కర్, హరీష్, హరినాథ్ , భాను, సాయి… తదితరులు పాల్గొన్నారు.
