నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు క్లియర్ చేసే క్రమంలో స్థానిక దుకాణదారులు ఎదురు తిరిగారు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..నగరంలోకి అత్యంత ఇరుకుగా ఉండే కుమార్ గల్లీలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్డు పై ఉన్న తోపుడు బాండ్లు,దుకాణాల సామాగ్రిని క్లియర్ చేసే క్రమంలో స్థానిక దుకాణదారులు మూకుమ్మడిగా పోలీసుల చుట్టూ చుట్టారు. ఈ మేరకు వెంటనే ట్రాఫిక్ సిఐ ప్రసాద్ అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.
