తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు.
రుద్రూర్ కు చెందిన నాగయ్య (52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్ లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు.
అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
