నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం రిజర్వేషన్లపై ఉన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మేయర్ స్థానాన్ని వరుసగా మూడోసారి మహిళ (జనరల్) కే కేటాయించారు. ఈసారి మేయర్ స్థానం కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
సామాజిక ఆర్థిక నేపథ్యం బలంగా ఉన్న నేతలనే మేయర్ అభ్యర్థులుగా రంగంలోకి దించడానికి సమాయత్తం అవుతున్నాయి. రెండు సార్లు మేయర్ పీఠం దక్కించుకున్న బిఆర్ యస్ ఈసారి నా మాత్రంగా మారింది.
ఈసారి మేయర్ స్థానం ఎలాగైనా సాదించాలని బీజేపీ పట్టుదలతో ఉంది ఎంపీ అర్వింద్ ఇప్పటికే ఇందుకు సంబంధించి కార్యాచరణ సైతం మొదలు పెట్టారు.డివిజన్ ల వారీగా బలమైన కార్పొరేటర్ అభ్యర్థుల కోసం పక్కగా రెండు పర్యాయాలు సర్వే లు సైతం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి మేయర్ అభ్యర్థిగా తెరమీదికి వచ్చారు. అర్బన్ నేతలు ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎంపీ అర్వింద్ సైతం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది పైగా గత ఐదేళ్లు నగరపాలక సంస్థలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పనిచేసారు. బిఆర్ యస్ వైఫల్యాలను ఆమె శక్తి మేరకు ఎండగడుతూ వచ్చారు. నగరంలో ప్రధాన సమస్యల ను కౌన్సిల్ సమావేశాలలో ఏకరువు పెడుతూ వచ్చారు అనేక అక్రమాలను ప్రస్తావించారు.
అందుకే ఆమె నే మేయర్ అభ్యర్థిగా తెరమీదికి వచ్చారు పార్టీ వర్గాలు సైతం ఫిక్స్ అయ్యారు. మరో వైపు పదేళ్ల తర్వాత మేయర్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. సొంతగా మెజార్టీ డివిజన్ లు దక్కక పోయినా యంఐయం సపోర్ట్ కోసం రంగం సిద్ధం చేసింది.
ఆ పార్టీ కూడా ఈసారి కార్పొరేటర్ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. వరుసగా రెండు పర్యాయాలు కార్పొరేషన్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కు పరిమితం అయింది. కానీ ఈసారి పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 2005 తరహాలోనే ఈసారి మెజార్టీ స్థానాలు గెలవాలనేది ఆ పార్టీ వ్యూహరచనగా ఉంది.
అందుకే బలమైన సామాజిక ఆర్థిక నేపథ్యం ఉన్న మహిళా ను మేయర్ అభ్యర్థి ని బరిలోకి దింపే ఆలోచన తో ఉంది. పీసీసీ చీఫ్ ఇద్దరు సలహాదారులు ఇప్పటికే మంత్రాంగం మొదలుపెట్టారు.
కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉన్న వారెవ్వరు అందుబాటులో లేక పోవడంతో డాక్టర్ వృత్తి లో సుదీర్ఘ కాలం పనిచేసిన కవిత రెడ్డి ని మేయర్ అభ్యర్థిగా తెరమీదికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు అవుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది.చివరిలో అవకాశం చేజారింది.
అయినప్పటికీ కవిత రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వుంటూ వస్తున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆమె ను మేయర్ బరిలోకి దించడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు.
