HomeCRIMEస్కూల్ కి వెళ్ళమని మందలించడంతో విద్యార్థి ఆత్మ హత్య...

స్కూల్ కి వెళ్ళమని మందలించడంతో విద్యార్థి ఆత్మ హత్య…

స్కూల్ కి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థి పరుగుల మందు సేవించి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాక్లూర్ మండలంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మాక్లూర్ మండలంలోని బోర్గం కుతాడి గంగా ప్రసాద్ 8వ తరగతి చదువుతున్నాడు.

గత కొన్ని రోజులుగా తరుచూ స్కూల్ కి వెళ్ళడం లేదు. అందుకు స్కూల్ కు వెళ్ళమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో విద్యార్థి జనవరి 27 న పురుగుల మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

దీంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ నెల 3 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments