కేంద్ర నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు..బోధన్ పరిధిలోని రెండు ఆర్వోబీ పనులపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల ముందు మంజూరు అయిన రెండు ఆర్వోబి పనులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తో నత్తనడక కొనసాగుతున్నాయని మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాలేక, సుదర్శన్ రెడ్డి తో అమలు అవుతాయా అని ప్రశ్నించారు.
6 గ్యారంటీలలో కేవలం మహిళలకు ఉచిత బస్సు మాత్రమే అమలు చేశారని అన్నారు. బోధన్ పరిధిలోని రెండు ఆర్వోబీ పనులు వేగంగా జరిగేలా చేయాలని డిమాండ్ చేశారు. మాధవనగర్, మామిడి పల్లి ఆర్వీబీ పనులకు రూ 13 కోట్లు విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు పది రోజుల్లో మామిడిపల్లి ఆర్ఓబి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు చెప్పినట్లు తెలిపారు.అదే విధంగా మాధవనగర్ ఆర్వోబీ పనుల పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఇక అర్సపల్లి ఆర్వీబీ కి చెందిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
బీసీలకు ఫీజ్ రీయింబర్స్మెంటే ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం, 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తుందని ఎద్దేవా చేశారు.బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని 17శాతం మాత్రమే కేటాయించిందన్నారు.బీసీ రిజర్వేషన్లు కేవలం రాజకీయ డ్రామా మాత్రమే అని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం నిధులు కోసమే ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.అలాగే స్థానిక ఎన్నికల్లో మహిళా ఓట్లకోసమే పావులా వడ్డీ పేరుతో ప్రభుత్వం డ్రామాలు చేస్తుందని ఆరోపించారు.గత 10 సంవత్సరాల నుంచి మహిళా గ్రూపులకు సుమారు రూ 630 కోట్ల పావులా వడ్డీలు చెల్లించడం లేదని ఆగ్రహించారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి చివాట్లు పెడతారని ఎద్దేవ చేశారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ,బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
