ఏకకాలంలో అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఈ నెల 24 న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్నారు
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లో రైతు డిక్లరేషన్ పేరుతో తెలంగాణ రైతులకు రూపాయలు రెండు లక్షల వరకు రుణాలన్నీ డిసెంబర్ 9న సోనియమ్మ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేశామని హామీ ఇవ్వడం జరిగింది
రైతులు ఎవరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దని ఒకవేళ అప్పులు కడితే మళ్ళీ రుణాలు రేవంత్ రెడ్డి రైతులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది
కానీ ఇటీవల విడుదల చేసినటువంటి మూడు విడుదల రుణమాఫీలు మన నిజాంబాద్ జిల్లా నిజాంబాద్ జిల్లాలో దాదాపు రెండు లక్షల 75 వేల మంది రైతులు ఉండగా మొదటి విడుదల 46వేల 456 మందికి రెండో విడతలో 23,628 మందికి మూడో విడతలో 15000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది
మూడు విడతలు కలిపి మొత్తం 85,84 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ కాగా ఇంకా దాదాపుగా నిజాంబాద్ జిల్లాలో ఒక లక్ష 89 వేల 916 మందికి రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటు వివిధ రకాల కారణాలను సాకులుగా చూపిస్తూ అర్హులైన రైతులకు రుణమాఫీ కాకుండా
ఈ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది
ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాలయాపన చేయకుండా జిల్లాలో ఇంకా రుణమాఫీ కానీ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం
రైతులతో కలిసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది అలాగే రుణమాఫీ అయ్యేంతవరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని నిజంప జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి తెలిపారు
