HomeLaw and Orderఆర్మూర్‌లో ఆకస్మిక సోదాలు

ఆర్మూర్‌లో ఆకస్మిక సోదాలు

ఆర్మూర్ పట్టణ రాజారామ్ నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా విస్తృత సోదాలు నిర్వహించారు.ఏసీపీ జె. వెంకటేశ్వర్లు రెడ్డి ట్రైనీ ఐపిఎస్ సాయి కిరణ్ ల ఆధ్వర్యంలో జరిగింది.

ఈ తనిఖీలలో 76 బైకులు, 4 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు,అనుమానితులను ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తించారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మోడిఫైడ్ సైలెన్సర్ ఉన్న 15 వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.

అసాంఘిక కార్యకలాపాలు, ఈవ్ టీజింగ్, మత్తు పదార్థాల వినియోగం నివారించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇల్లు అద్దెకు ఇవ్వే ముందు తగిన ధ్రువపత్రాలు తీసుకోవాలని, లేకపోతే యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో సీఐ ఎస్సైలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్ సిబ్బంది కలిపి 104 మంది పోలీసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments