నేరం చేసేందుకు అనుమానాస్పద రీతిలో సంచరిస్తూ పట్టుబడిన వ్యక్తికి హైదరాబాద్‌లోని ఆరవ ప్రత్యేక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించింది.
చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఈ–పెట్టీ కేసులో ఈ తీర్పు వెలువడింది.పోలీసుల వివరాల ప్రకారం.. బాలాపూర్‌లోని షాహీన్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఖలీల్ అనుమానాస్పదంగా తిరుగుతూ నేరానికి పాల్పడే అవకాశమున్న పరిస్థితుల్లో పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 61(బి) కింద ఈ–పెట్టీ కేసు నమోదు చేశారు.
కేసును విచారించిన గౌరవ ఆరవ ప్రత్యేక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎం. భాస్కర్, కేసులోని ఆధారాలను పరిశీలించి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ మూడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించారు.ఈ కేసును చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సురేష్‌రెడ్డి దర్యాప్తు చేయగా, సీడీఓ జి. సాయినాథ్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
