గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో గల కోల్డ్ స్టోరేజ్ దగ్గర దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా అతనిని పట్టుకొని తనిఖీ చేయగా అతని ప్యాంటు జేబులో ఐదు గంజాయి పాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అనంతరం అతను నివసించే గదిలో తనిఖీ చేయగా ఒక బ్యాగులో 5.25 KG ల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం ఎండు గంజాయిని, నిందితుడిని, ఒక సెల్ ఫోను ని నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.
