HomeCRIMEవిద్యార్ధిని చితకబాదిన టీచర్…ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

విద్యార్ధిని చితకబాదిన టీచర్…ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..

విద్యార్థిని తల్లిదండ్రులకు ధమ్కి

పరీక్ష రాసే ఓ విద్యార్థినిని పిలిచి నీకు స్కూలు అనగానే తల నొప్పి వస్తుందా అని దుర్భాషలు ఆడుతూ ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినిని చితకబాదింది.

ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన అశ్విత. దుబ్బా ప్రాంతంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది.

ఈ మేరకు మూడు రోజుల క్రితం విద్యార్థిని అశ్విత తలనొప్పిగా ఉందని పాఠశాల ఉపాధ్యాయురాలైన కల్పనాకు చెప్పి ఇంటికి వెళ్ళింది.మరుసటి రోజు ఉదయం యధావిధిగా స్కూలుకు వెళ్లిన అశ్వితకు ఉపాధ్యాయునిరాలైన కల్పన గణిత శాస్త్రం లో స్లీప్ టెస్ట్ పెట్టింది.

అందుకు విద్యార్థిని అశ్విత అందరి విద్యార్థిని లాగానే స్లిప్ టెస్ట్ రాస్తూ ఉండగా టీచర్ కల్పన విద్యార్థినినీ పిలిచి నీవు స్కూలుకే సరిగా రావావు బయట తిరగడానికి వెళ్తావు అని దుర్భాషలతో విద్యార్థిని కర్రతో చితకబాదింది.

ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పొద్దని మందలించిందనీ విద్యార్థిని పేర్కొన్నారు. అందుకు అంగీకరించిన విద్యార్థిని సరే అని తరగతి గదిలో కూర్చున్నట్లు తెలిపారు.అయిన మళ్లీ టీచర్ బయటకు పిలిచి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం తెలిపారు.తల్లిదండ్రులకు అందుకు అనుగుణంగా వచ్చి టీచర్ కల్పన తో కలిసి మాట్లాడారు.

అయిన తల్లిదండ్రులకు కూడా టీచర్ దాబాయించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు గేటు బయటకు వెళ్లగానే మళ్లీ విద్యార్థిని పిలిచిన టీచర్ దుర్భాషలతో ఎవరు వచ్చినా నిన్ను స్కూల్లో చదవాలి నీవు స్కూల్లో టెన్త్ క్లాస్ ఎలా పాస్ అయి బయటకు వెళ్తావో చూస్తానని విద్యార్థినిని మందలించిందనీ వాపోయారు..

అనంతరం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్థినిని చూడగా ఒంటిపై తీవ్ర వాతలతో ఉన్నాయని తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థిని తీసుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు.నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments