పీడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్..భీంగల్ మండలం పల్లికొండ గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని పీడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు.
సోమవారం నిజామాబాద్ నగరంలో జిల్లా ఉపవిద్య శాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.పీడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, జిల్లా నాయకులు వినోద్, అరుణ్, కోటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
