HomeCRIMEమరాఠా ముఠా వేటలో బృందాలు ……కీలక పురోగతి ?

మరాఠా ముఠా వేటలో బృందాలు ……కీలక పురోగతి ?

జిల్లాలో వరుస చోరీ లకు పాల్పడిన దొంగల ముఠా వేట కోసం ప్రత్యేక పోలీసు బృందాలు మహా రాష్ట్ర లో జల్లెడ పడుతున్నాయి. ప్రత్యేక బృందాలు ఇప్పటికే కీలక పురోగతి సాధించాయి.కర్నాటక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో ఈ ముఠా మెడికల్ షాపు చోరీ, రెండు చైన్ స్నాచింగ్ లకు పాల్పడింది.

నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏ ప్రాంతానికి చెందిన వారనేది మొదట అంచనా కు రాలేక పోయిన పోలీసులు ఆ తర్వాత ఆనవాళ్ల ఆధారంగా పక్కాగ మరాఠా ముఠా గా నిర్ధారణకు వచ్చారు. కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో మహారాష్ట్ర వెళ్లిన బృందాలు స్థానిక పోలీసుల సహకారం తో కీలక పురోగతి సాధించారని సమాచారం.

మొదట ఈ ముఠా లో నలుగురే ఉన్నారని భావించినప్పటికీ ఆరు గురు ఉన్నారని తేలింది. నిర్మల్ మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముఠా మొదట ఆర్మూర్ మాక్లూర్ దుబ్బా ప్రాంతాల్లో చోరీలు చేసింది టాటా సుమో లోనే బై పాస్ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లి నట్లుగా సీసీ కెమెరా ల్లో గుర్తించారు. వరుస చోరీ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఘటన జరిగిన అనంతరం నిందితులు పారిపోయేందుకు ఉపయోగించిన బొలెరో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ వాహనం మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు నిర్ధారించుకున్న దర్యాప్తు బృందం .

నిందితులు మహారాష్ట్రలోని పుణే శివారు ప్రాంతంలో ఉన్నట్లుగా పక్కగా సమాచారం రావడంతో స్థానిక పోలీసులను అప్రమత్తం చేసారు. వీరిపై ఇప్పటికే మహా రాష్ట్ర లోనూ పలు కేసులు నమోదై ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

అందుకే అక్కడి పోలీసులు సైతం జిల్లా నుంచి వెళ్లిన బృందానికి సహకరిస్తున్నారని సమాచారం అయితే ఈ ముఠా ఏ ప్రాంతంలో తలదాచుకున్నది పక్కగా సమాచారం వచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments