HomeTelanganaNizamabadహోరాహోరీగా సాగిన రాష్ట స్థాయి బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు…బాలికల ఛాంపియన్ గా రంగారెడ్డి జట్టు...

హోరాహోరీగా సాగిన రాష్ట స్థాయి బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు…బాలికల ఛాంపియన్ గా రంగారెడ్డి జట్టు కైవసం హైదరాబాద్ రన్నర్స్…బాలుర విభాగం లో హైదరాబాద్ ఛాంపియన్ రంగ రెడ్డి రన్నర్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వస్తున సీఎం కప్ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ముగిసింది .బాల బాలికల విభాగంలో ఫైనల్స్ లో రంగ రెడ్డి, హైదరాబాద్ జిల్లా జట్లు మధ్య హోరాహోరీ గా ఆడి రంగ రెడ్డి జట్టు టైటిల్ కైవసం చేసుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ క్రీడలకు అడ్డ నిజామాబాద్ జిల్లా…క్రీడాకారులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టోర్నమెంట్లు సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని సూచించారు. గెలుపొందా క్రీడాకారులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని,ఓటమి చెందిన క్రీడాకారులు నిరాశ చెందకుండా రానున్న రోజుల్లో జరిగే టోర్నమెంట్ కోసం మంచి శిక్షణ తీసుకొని గెలుపు దశగా ప్రయత్నం చేయాలని అన్నారు. స్టేడియం నిర్మాణానికి నావంతు గా కృషి చేస్తానని అసెంబ్లీలో లో కూడా మాట్లాడినాను అన్ని గుర్తుచేసినారు. స్టేడియం అయ్యేవరకు నేను క్రీడాకారుల కోసం ప్రయత్నం చేస్తాను అన్ని అన్నారు.

ముగింపు కార్యక్రమానికి స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా,Deo అశోక్ కుమార్,44వ division కార్పొరేటర్ బట్టు రాఘవేంద్ర,తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్ రెడ్డి, జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నరసయ్య,తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్రావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ రావు , బొబ్బిలి నరేష్, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments