తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవాలతో పాటు సామాజిక భద్రతకు సంబంధించిన కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12:00 గంటలకు: నిజామాబాద్ నగరంలోని బైపాస్ చౌరస్తా వద్ద “Arrive Alive” (రోడ్డు భద్రత) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం నూతనంగా నిర్మించిన నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్లను డీజీపీ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటలకు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమాల్లో డీజీపీతో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,పోచారం శ్రీనివాస్ రెడ్డి,మహమ్మద్ అలీ షబ్బీర్, కె.ఆర్. సురేష్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు,భూపతి రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
డీజీపీ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
