తెలంగాణ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటి ల కంటే మొదటి స్థానంలో ఉండాలని, అక్రమలకు అడ్డాగా మారకూడదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు.
బుదవారం తెలంగాణ యూనివర్సిటీ లో విసి యాదగిరి రావు ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ లో గత వారం రోజుల్లో పత్రికలో యూనివర్సిటీ లో జరిగిన అక్రమల గురించి రావడం జరిగింది. దీని విషయం లో విసి యాదగిరి ను అడిగి వివరాలు తెలుసుకున్నారు యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తారని 20కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు.
ఖేలో ఇండియా ద్వారా సింథటిక్ ట్రాక్ నిర్మించడానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని విసి తెలిపారు. ఏ అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అండగా ఉంటారని భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని వీసీకి దినేష్ తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రకాంత్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ శ్యామ్ రావు , ప్రధాన కార్యదర్శి సురేష్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, పరశురాం, లక్ష్మీనారాయణ రత్నం యూనివర్సిటీ ఎబివిపి నాయకులు పృద్వి,సమీర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదాల నరేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓంసింగ్, నాయకులు వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…….
