HomeTelanganaNizamabadథాయిలాండ్–మయన్మార్‌లో చిక్కుకున్న తెలుగు యువతకు విముక్తి...కేంద్ర విదేశాంగ శాఖ సమర్థ చర్యలు – 297 మంది...

థాయిలాండ్–మయన్మార్‌లో చిక్కుకున్న తెలుగు యువతకు విముక్తి…కేంద్ర విదేశాంగ శాఖ సమర్థ చర్యలు – 297 మంది తెలుగు యువత రక్షణ..

థాయిలాండ్–మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లోని టాచిలేక్, ష్వే కొక్కో, మయావాడీ ప్రాంతాలకు తెలుగు యువతను నకిలీ ఉద్యోగ ఆఫర్లతో మోసం చేసి, సైబర్ నేరాలకు బలవంతంగా పనిచేయిస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది..

ఈ అంశాన్ని లోక్‌సభ సభ్యులు అరవింద్ ధర్మపురి లోక్‌సభ రూల్ 377 కింద ప్రస్తావించగా, దీనిపై విదేశాంగ శాఖ సమగ్రంగా స్పందించింది. 2,545 మంది భారతీయులు అక్రమంగా తరలింపు
విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, ఈ ఘటనల్లో మొత్తం 2,545 మంది భారతీయులు అక్రమంగా తరలించబడినట్లు గుర్తించారు.

2,390 మంది భారతీయులకు విముక్తి
భారత రాయబార కార్యాలయాలు (థాయిలాండ్, మయన్మార్) చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటివరకు
2,390 మంది భారతీయులను విజయవంతంగా రక్షించారు.

ఈ ఘటనల్లో
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు చెందిన 316 మంది బాధితులుగా గుర్తింపు
అందులో 297 మంది ఇప్పటికే సురక్షితంగా రక్షించబడ్డారు
భారతీయుల భద్రతకు కేంద్రం అత్యున్నత ప్రాధాన్యత
విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments