కీలక స్థానం లో వుంటూ తండ్రి అధికారం మాటున చెలరేగి పార్టీలో పాలనా వ్యవహారాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన డీసీసీబీ ఛైర్మెన్ భాస్కర్ రెడ్డి కి సొంత పార్టీ నుంచి అస్సమ్మతి సెగ తెగిలింది. పార్టీ అధికారంలో వుండగా కనీసం బ్యాంక్ వైపు కన్నెత్తి చూడలేక పోయిన డైరెక్టర్లు తిరుబాటు జెండా ఎత్తారు.భాస్కర్ రెడ్డి ని గద్దె దింపడమే లక్ష్యంగా అవిశ్వాస అస్రం ను సంధించారు. అదికూడా మాజీ మంత్రి కెసిఆర్ అంతరంగికుడిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి విధేయుడు వైస్ ఛైర్మెన్ రమేష్ రెడ్డి నేతృత్వంలోనే భాస్కర్ రెడ్డి ని కుర్చీ దించే దింపే కార్యం జరుగుతుంది. ప్రశాంత్ రెడ్డి పట్టుబట్టి రమేష్ రెడ్డి కి వైస్ ఛైర్మెన్ పదవీ కట్టబెట్టారు.
20 డైరెక్టర్లు ఉండే డీసీసీబీ పాలక మండలిలో 18 మంది ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వైస్ ఛైర్మెన్ ఇచ్చిన అవిశ్వాస నోటీసు లకు స్పందించిన జిల్లా సహకార అధికారి ఈ నెల 21 న బలపరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చింది మొదట 15మంది డైరెక్టర్లే కానీ తాజా పరిణామాలతో మరో ముగ్గురు కూడా అస్సమ్మతి శిబిరంలోకి వెళ్లారు. భాస్కర్ రెడ్డి కి జహీరాబాద్ లోకసభ టికెట్ కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
సిట్టింగ్ ఎంపీ మీద లేని అస్సమ్మతి ఎగదోసి బీబీపాటిల్ పార్టీ వీడేలా చక్రం తిప్పారు. దాదాపు టికెట్ ఖాయం అవుతున్న నేపథ్యంలో అవిశ్వాసం తెరమీదికి రావడం శ్రీనివాస్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. నిజానికి డీసీసీబీ ఛైర్మెన్ పదవీ చేజారకుండా మంత్రాంగం నడిపిన ఫలితం లేకుండా పోయింది.. డీసీసీబీ పాలకవర్గంలో తన పట్టు కోల్పయిన భాస్కర్ రెడ్డి రాజీనామచేయాలా ? న్యాయ స్థానం ను ఆశ్రయించాలనేది మదన పడుతున్నారని సమాచారం.
తండ్రి కీలక స్థానంలో ఉండడమతో భాస్కర్ రెడ్డి డైరెక్టర్ లను పూచిక ఫుల్లుగా చేసేది.అదే డైరెక్టర్లు తిరుబాటు కు దారితీసింది.నిజానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలెవ్వరూ డీసీసీబీ వ్యవహారాల్లో కనీస ఆసక్తి చూపలేదు.పాలక మండలి లో కాంగ్రెస్ కు ప్రాతి నిధ్యమే లేదు. కానీ అవిశ్వాస పక్రియ లో అధికారుల చొరవ కావాలి అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల సహకారం అనివార్యంగా భావించిన అస్సమ్మతి వర్గం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని శరణాజొచ్చారట.
అయితే మెజార్టీ డైరెక్టర్లు అజ్ఞాతంలోకి వెళ్లడం తో భాస్కర్ రెడ్డి సైతం దిక్కు తోచని స్థితిలో ఉన్నారట. ఎలాగో 21 బల పరీక్ష తేది ని ఖరారు చేసారు. ఆలోపే డైరెక్టర్ల ను దారిలోకి తేవాలా లేదంటే కోర్టు నుంచి స్టే తేవాలా అనే డైలమా లో ఉన్నారు.అవిశ్వాస పరీక్ష లో ఓడిపోయి అవమానకరంగా వైదొలిగే కన్న స్వచ్ఛందంగా తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది