బిఆర్ యస్ అధికారం కోల్పోయిన తర్వాత మొదటి సారిగా ప్రజాసమస్య ల మీద బుధవారం రోడ్డెక్కింది. కేటీఆర్ స్వయంగా ఆయా జిల్లాల ముక్య నాయకులతో మాట్లాడారు. లోకసభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో క్యాడర్ ను ఉత్తేజం కలిగించే దిశ గా ఈ ఆందోళన మల్చుకోవాలని ధర్నా లను సూపర్ హిట్ చేయాలని భావించారు. కానీ మాజీ ఎమ్మెల్యే లే మొహం చాటేశారు.
జిల్లాలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాల్కొండ లో జరిగిన ధర్నా లో పాల్గొన్నారు కానీ జిల్లానుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ కవిత ఎప్పటిలాగే డుమ్మా కొట్టారు. ఆమె హైదారాబాద్ కే పరిమితం అయ్యారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త ధర్నా లకు పిలుపు నిచ్చింది.
ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాలకు దిగాయి. నగరంలోని ధర్నా చౌక్ లో ఎల్‌ఆర్‌ఎస్ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ నినాదాలు చేస్తూ నినాదాలు చేసారు. అర్బన్ నిజామాబాద్ నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బోధన్ ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఆందోళన ఊసే కనిపించలేదు.
కేటీఆర్ కెసిఆర్ చుట్టూ చక్కర్లు కొట్టే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నేతలు అర్బన్ నేతలతో కలిసి మమా అనిపించారు. జెడ్పి ఛైర్మెన్ కూడా జిల్లా కేంద్రంలోనే మేయర్ తో కలసి హాజరు అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే లు హైదారాబాద్ కే పరిమితం అయి ఉంటున్నారు.
క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను పలకరించే నాధుడే లేకుండా పోయారు. అందుకే ఎడాపెడా వలస లు జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు.వలస వెళ్తున్న వారు మాజీ ఎమ్మెల్యే లకు చెప్పి మరీ వెళ్తున్నారట. మాజీ ఎమ్మెల్యే లెవ్వరు వలస వెళ్తున్న నేతలను వారించలేక లేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి






