అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లోకసభ అభ్యర్థి కోసం దిక్కులు చూస్తుంది. చివరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపే మొగ్గుచూపుతోంది. అనేక మంది నేతల పేర్లు పరిశీలనకు వచ్చినా వరుసగా మూడు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన జీవన్ రెడ్డే పెద్దదిక్కుగా భావిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఫై గంపెడు ఆశలు ఉండే.
కానీ ఆయన ఎన్నికల బరిలోకి దిగడానికి ఆసక్తి చూపక పోయినప్పటికి తన అన్న నర్సింహా రెడ్డి కి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ ఆయనకు టికెట్ వద్దని జిల్లాకు చెందిన ఓ దిగ్గజ నేత తెగేసి చెప్పి నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క బీసీ కి టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఈసారైనా లోకసభ టికెట్ బిసి కి ఇవ్వాలని మహేష్ గౌడ్ లాంటి నేతలు పట్టుబడుతన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అనిల్ ఇరవత్రి ఆకుల లలితా లాంటి బీసీ సామజిక వర్గం పేర్లు తెరమీదికి వచ్చాయి.
కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జీవన్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. మరో బలైమన నేత లేకపోవడంతో సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారు. మానాల మోహన్ రెడ్డి ఆరెంజ్ సునీల్ రెడ్డి లు పోటీకి ఆసక్తి చూపెట్టిన వారి పక్షాన టికెట్ కోసం గట్టిగా అడిగే నాథుడే లేరు. జిల్లా పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపే ఉన్నారు.
ఈ విషయంలో ఆయన అంత రంగం ఎవ్వరికి అర్థం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన కాంగ్రెస్ పార్టీ లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించే వ్యూహరచనలో ఉంది. బీజేపీ అభ్యర్థి అర్వింద్ ను ఢీకొట్టే సత్తా ఉన్న నేతకోసం ఎడతెగని కసరత్తులు చేసింది.ఆర్థిక సామాజిక నేపథ్యాలే ప్రామాణికంగా భావించి కొత్త నేతల కోసం వాకబు చేసారు.
ఈసారి ఎంపీ ఎన్నికల్లో మోడీ మానియా బలంగా ఉండబోతుందని భావిస్తున్న తటస్థులెవ్వరు కాంగ్రెస్ టికెట్ కోసం ముందు కు రాలేక పోయారు. నిజామాబాద్ లోకసభ పరిధి లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అయిదు నిజామాబాద్ జిల్లాలో వుంటే రెండు నియోజకవర్గాలుండే జగిత్యాల్ జిల్లాకు చెందిన నేతకు టికెట్ ఇవ్వడం ఫై ఆక్షేపణలు వ్యక్తం అయ్యాయి. అదీగాక ఎమ్మెల్సీ గా గెలిచాక జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వైపు కనీస దృష్టి పెట్టలేక పోయారనే విమర్శలున్నాయి. కానీ మరో బలమైన అభ్యర్థి అందుబాటులో లేకపోవడంతో జీవన్ రెడ్డి ని బరిలోకి దించడం కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా భావిస్తోంది