HomeTelanganaNizamabadఆగని రగడ .....ఎన్నికల వేళ వోటర్ల పంచాయితీ ....మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన ఎమ్మెల్య

ఆగని రగడ …..ఎన్నికల వేళ వోటర్ల పంచాయితీ ….మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన ఎమ్మెల్య

మున్సిపల్ ఎన్నికలు నిర్వహిచడానికి ఎన్నికల సంఘం సమాయత్తం అవుతుంది. శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. మరో వైపు వోటర్ల జాబితా ఫై రగడ ఆగడం లేదు. డివిజన్ ల వారీగా సోమవారం వోటర్ల జాబితా ను యంత్రాంగం ఖరారు చేసింది.

ఫైనల్ జాబితా ప్రకటించడంతో రాజకీయ రచ్చ మళ్ళీ మొదలయ్యింది. నగరంలో వోటర్ల జాబితా లో అవకతవకలున్నాయని ఆరోపిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించారు.

ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు తమ డివిజన్ లలో వోటర్ల జాబితా జరిగిన అక్రమాల తంతు ను అధికారులకు ఆధారాలతో నివేదించారు వోటర్ల జాబితా మొత్తం గందరగోళంగా వుందని ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ డివిజన్ వోటర్ల జాబితా లో ఎలా చేర్చారంటూ మండి పడ్డారు.

వోటర్ల జాబితాను పూర్తీ స్థాయిలో ప్రక్షాళన చేసే దాక ఎన్నికల పక్రియ ముందుకు తీసుకెళ్లవద్దన్నారు. ఆయా డివిజన్ ల నుంచి వచ్చిన అబ్యంతరాలను అధికారులు తీసుకున్నారు పక్కగా వుంటే మార్పులు చేర్పులకు ఎన్నికల కమిషన్ కు నివేదిస్తామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments