నగరంలోని డబుల్ బెడ్ రూం ప్రాంతం లోని లక్ష్మీ కుబేర ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు అలజడి సృష్టించారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు విలువైన వస్తువుల కోసం గాలించారు.
మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు, తాళాలు విరిగి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఐదో పట్టణ (5th Town) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆలయంలోని సుమారు రూ. 2,000 విలువైన ఇత్తడి మరియు రాగి పూజా సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టినట్లు తెలిపారు.
