లింబాద్రి గుట్ట జాతర సాక్షిగా అధికార కాంగ్రెస్ బిఆర్ యాస్ నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి ఒకరిమీద ఒకరు విరుచుక పడుతున్నారు. శుక్రవారం లింబాద్రి గుట్ట జాతర నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి .మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అనుయాయులతో శుక్రవారం జాతర కు బయలు దేరారు.ట్రాఫిక్ ఇబ్బందులతో ఆయన వాహనం లో గుట్టమీదికి వెళ్లలేక పోయారు ఆయన వాహనకు లైన్ క్లియర్ చేసే వారేలేకుండా పోయారు.
దీనితో చేసేది లేక కాలి నడకనే గుట్టమీదికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆయన పోలీసుల ట్రఫిక్ వైఫల్యాల మీద నిప్పులు చెరిగారు పనిలో పనిగా అధికార పార్టీ కుట్ర అంటూ మండి పడ్డారు గతంలో ఎప్పుడు ట్రఫిక్ ఇబ్బందులు రాలేదని ఈసారి ఎందుకు వచ్చిందన్నారు తాను స్వామి వారిని దర్శించుకోకుండా కుట్ర చేసారని తాను వస్తుంటే ట్రాఫిక్ క్లియర్ చేయలేదని పోలీసులు అధికార పార్టీ నేతల పైశాచిక ఆనందం కోసం పనిచేస్తున్నారంటూ రగిలి పోయారు.
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసి ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు గుళ్ల వద్ద రాజకీయ ఎందుకన్నారు. బహుశా అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన మొదటి జాతర కావడం వల్ల మునుపటి అధికార దర్పం లేకపోవడంతో ప్రశాంత్ రెడ్డి ఇబ్బంది పడ్డరేమో.భవిష్యత్తులో కూడా మీకు ఇదే ఇబ్బంది వుంటుంది రాబోయే 4సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుంది కాబట్టి ప్రశాంత్ రెడ్డి కి ఈ సమస్య తప్పదని ఆయన దెప్పి పొడిచారు రథోత్సవనికి భక్తులు అధికంగా రావడం, రథోత్సవాన్ని చూడాలనే తొందరలో వాహనాలను రోడ్డుకి ఇరువైపులా నిలిపారని అలాగే మరో ముగ్గురు రాంగ్ రూట్లో రావడం వల్లే వాహనాల రాకపోకల్లో అంతరాయం కలిగిందన్నారు .
రథోస్తవ సమయంలో పోలీసులు ఎక్కువ మంది పైకి వెళ్లడం వల్ల కింద ఈ సమస్య తలెత్తిందన్నారు. కాంగ్రెస్ నాయకులను గుట్టమీదికి అనుమతి ఇచ్చి తనను ఆపేశారని ప్రశాంత్ రెడ్డిని ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు.
తనతో పాటు టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్,,ముత్యాల సునీల్ లు దాదాపు 2 కిలోమీటర్లు నడిచి గుట్టమీదికి వెళ్ళమని ప్రశాంత్ రెడ్డి తెల్సుకుంటే బాగుంటుంది. దేవుని కోసం మనం వెళ్ళాలి కానీ మన కోసం దేవుడు ఆగరాని ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని,ఆయన చేస్తున్న ఆరోపణలో పస లేదన్నారు
