HomeTelanganaNizamabadడీజల్ ఫై పేచీ నిలిచి పోయిన చెత్త వాహనాలు …

డీజల్ ఫై పేచీ నిలిచి పోయిన చెత్త వాహనాలు …

డీజిల్ విషయంలో వివాదం తలెత్తడంతో నగరంలో చెత్త వాహనాలు గంటల తరబడి రోడ్ల మీదే నిలిచి పోయాయి. పెట్రోల్ బ్యాంకు యజమాని నిర్వాహక వల్లే చెత్త వాహనాలకు మైలేజి రావడం లేదని డ్రైవర్లు మంగళవారం ఆందోళనకు దిగారు.

పవర్ డీజిల్ కాకుండా నార్మల్ డీజిల్ మాత్రమే వేయాలని డిమాండ్ చేస్తూ తమ వాహనాలను బంక్ ముందే నిలిపి నిరసన వ్యక్తం చేసారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన చెత్తవాహనాలకు సాయి నగర్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో రోజు డీజిల్ వేసుకుంటారు.

నెలవారీ ఖాతా ఉండడం వల్ల కార్పొరేషన్ వాహనాలు రోజువారిగా ఇక్కడే డీజిల్ వేసుకోవాలి. ఇందుకోసం రోజు ఇక్కడే వాహనాలు బారులు తీరుతాయి కానీ ఇక్కడ కార్పొరేషన్ వాహనాలకు నార్మల్ డీజిల్ కు బదులుగా పవర్ డీజిల్ నే ఇస్తున్నారు.

సాధారణ ప్రజానీకం పవర్ డీజిల్ ను వేసుకోరు అందుకే కానీ కంపెనీ మాత్రం కచ్చితంగా పవర్ డీజిల్ కోట మేరకు తీసుకోవాలి సో ఆ పవర్ డీజిల్ ఉద్దెర గిరాకీ కి అంటగడుతారు.

ఇది కొంత కాలంగా వస్తున్న పక్రియ అయితే మున్సిపాలిటీ వాహనాలు రాగానే పెట్రోల్ బంక్ యజమాన్యం పవర్ డీజిల్ నింపడం వలన డిజిల్ తక్కువ వచ్చి మైలేజి సరిగ్గా రాకపోవడంతో అధికారులు మాత్రం కోట మేరకు ఆయా వాహనాలకు డీజిల్ ఇచ్చి చేతులు దులుపు కుంటున్నారు.

కానీ చెత్త వాహనాలకు ఈ పవర్ డీజిల్ సరిపోకవడంతో డ్రైవర్ల మీదే ఆర్థిక భారం పడుతుంది. కోట మేరకు డీజిల్ ఇచ్చేస్తున్న అధికారులు మైలేజి తక్కువ గా వస్తే ఆ బాధ్యత తమది కాదని అధికారులు తెగేసి చెప్తున్నారు. దీనితో డ్రైవర్లకు దిక్కు తోచిని పరిస్థితి వచ్చింది.

పవర్ డిజిల్ తో తమ వాహనాల కు మైలేజి రావడం లేదనేది డ్రైవర్ల వాదన.
మున్సిపాలిటీలో గత కొంత కాలంగా తమకు జీతాలు కూడా టైమ్ కు ఇవ్వడం లేదని ఇలాంటి పరిస్థితిల్లో డీజిల్ కోసం తాము జేబులో నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments