ప్రాణాపాయంలో ఉన్న వారికి సత్వర వైద్యం అందించే అంబులెన్స్ ల నిర్వహణ ను ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొత్త అంబులెన్స్ కోసం పంపిన ప్రతిపాదనలు అటకెక్కాయి. దీనితో పాత అంబులెన్స్ లతోనే రోగుల ను తరలిస్తున్నారు.
రోజు కనీసం రెండు వేల మంది రోగులొచ్చే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏళ్ల క్రితం నాటి అంబులెన్స్ ఎప్పుడు అందుబాటులో ఉంది.అత్యవసర సమయాల్లో తక్షణ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన ఈ అంబులెన్స్ స్టార్ట్ అవవడానికే మొరాయిస్తుంది.
కనీస మరమత్తులు కూడా చేయించలేని దుస్థితి నెలకొంది.మరమత్తులు అప్పటికప్పుడు చేయించక పోవడం వల్ల అత్యవసరాల్లో ముందుకు కదలడానికే అంబులేన్స్ లు సతాయిస్తున్నాయి. ఉష్ణో గతలు పడిపోయి చలి పెరగడంతో బ్యాటరీ లు డౌన్ అవుతున్నాయి.
బ్యాటరీ లకు కాలపరిమితి వుంటుంది. కానీ నిధుల కొరత మూలంగా కాలం చెల్లిన బ్యాటరీ ల తోనే నెట్టుకొస్తున్నారు . కొంతకాలంగా మెంటేన్స్ కి బిల్లులు రాకపోవడమే అంబులెన్స్ ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు అంబులెన్స్ ల నిర్వహణ విషయంలో అలసత్వం కొనసాగితే వాహనం పూర్తిగా మూలకుపడే అవకాశం ఉంది.
ఇప్పటికైన ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. ఆపద సమయాల్లో అంబులెన్స్ లు బ్యాటరీ డౌన్ సమస్య తో స్టార్ట్ కావడం లేదని రోగుల బంధువులు లేదంటే ప్రైవేట్ వ్యక్తులతో నెట్టించి మరి స్టార్ట్ చేస్తున్నారు.
