ఎల్లారెడ్డి లో దొంగలు మరో సారి రెచ్చి పోయారు తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి భారీఎత్తున ఆభరణాలు ఎత్తుకెళ్లారు దేవునిపల్లి గ్రామానికి చెందిన దుంపల బాలరాజ్ గత ఆరు నెలల నుండి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో ఉంటున్నాడు . అప్పుడప్పుడు తన స్వగ్రామానికి వచ్చిపోతూ ఉండేవాడు. ఆ విధంగానే ఈ నెల 5నే వచ్చి వెళ్ళాడు కానీ బుధవారం ఆయన ఇంటి కి వేసిన తాళం పగిలి పోయిఉంది. స్థానికుల సమాచారం మేరకు బాలరాజు హుటాహుటిన వచ్చారు ఇంట్లోని బీరువా తలుపులు పగలగొట్టి సుమారు 80 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
