HomeTelanganaNizamabadమైనారిటీల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది.నిజామాబాద్‌లో ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్...

మైనారిటీల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది.నిజామాబాద్‌లో ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆశయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం సోదర సోదరీమణులకు ప్రభుత్వం తరపున అందజేస్తున్న ‘రంజాన్ తోఫా’ను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం సహనం, దాతృత్వం మరియు సోదర భావానికి ప్రతీక అని కొనియాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ తోఫా ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని, రంజాన్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మైనారిటీ విభాగం నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments