HomePOLITICAL NEWSUncategorizedపాలనా వ్యవహారాల్లో కనిపించని అధికార ముద్ర ……..నా మాత్రంగా మారిన ఇంచార్జ్ మంత్రి పర్యవేక్షణ ……...

పాలనా వ్యవహారాల్లో కనిపించని అధికార ముద్ర ……..నా మాత్రంగా మారిన ఇంచార్జ్ మంత్రి పర్యవేక్షణ …… ఇద్దరు ఎమ్మెల్యే ఎవరికీ వారే

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇంకా పాలనా వ్యవహారాల్లో పట్టు సాధించలేక పోతుంది.జిల్లా పాలనా వ్యవహారాల్లో అధికార పార్టీ ఇంకా తమదైన ముద్ర వేసుకోలేక పోతుంది.ఆయా ప్రభుత్వ శాఖల్లో ప్రగతి పనులను సమీక్షించే నాధుడే లేకుండా పోయారు.

జిల్లాస్థాయి అధికారులది ఆడిందే అట పాడిందే పాట అన్నట్లుగా సాగుతుంది. రేవంత్ క్యాబినెట్ జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఏడాది క్రితం నియామకం అయినా ఇంచార్జి మంత్రి జిల్లాకు చుట్టపు చూపు గా మారారు.

ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యే లున్నారు. మరొకరు బిఆర్ యస్ నుంచి వచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యే లు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. కానీ వీరంతా ఎవరికి వారే యమునా తీరున్నట్లుగా వుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీలోనే ఆధిపత్య పోరు పరాకాష్ట కు చేరింది.

ఎవరి మాట వినాలో ఎవరిని లైట్ తీసుకోవాలో అధికారులకు దిక్కు తోచడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నది ఇద్దరే ఎమ్మెల్యే లు న్నారు.
బోధన్ మాజీ మంత్రి సుదర్శన్ కి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి లమధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది.

రూరల్ సెగ్మెంట్ కు చెందిన ఒకరిద్దరు నేతలను సుదర్శన్ రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు.అదే భూపతి రెడ్డి ని నొచ్చుకునేలా చేసింది. ఆ సెగ్మెంట్ లో పాలనా వ్యవహారాల్లో ను జోక్యం చేసుకుంటున్నారు.

ఎవరి ఆదేశాలు అనుసరించాలో అధికారులకు అంతు చిక్కడం లేదు.జక్రాన్ పల్లి కాలిగోట్ వద్ద కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఎంపీ అర్వింద్ ప్రతిపాదనలు తయారు చేయించారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం సంప్రదించారు. కానీ అధికారులు మాత్రం ఆ ప్రతిపాదనలు పక్కకు పెట్టేసి బోధన్ సెగ్మెంట్ లో షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో పెట్టాలని నివేదించారు.

సాంకేతిక కారణాలతో విద్యాసంస్థ మంజూరి నిలిచిపోయింది. భూపతి రెడ్డి అంగీకారం తో ప్రతిపాదనలు సిద్ధం అయినప్పటికి అధికారులు ఎలా మారుస్తారంటూ అర్వింద్ ఒంటికాలు మీద లేచారు.

అసలు జిల్లాలో ప్రగతి పనులు సంక్షేమ పథకాల అమలు తీరును అరా తీసే వారే అధికార పార్టీ లో లేకుండా పోయారు.ఇంచార్జి మంత్రి జూపల్లి సైతం మూడే సార్లు వచ్చినా రివ్యూ మీటింగ్ మొక్కుబడిగా ముగించేసి వెళ్లారు.కానీ ఎమ్మెల్యే ఓడిన నేతలతో భేటీ అయి జిల్లా పరిస్థితులను వాకబు చేయలేక పోయారు.

మండల స్థాయి లో అధికారులు స్థానిక నియోజకవర్గ ఇంచార్జి కనీసం టచ్ లో వుంటున్నారు కానీ జిల్లా స్థాయి అధికారులను అజమాయిషీ చేసే వారే ఎవ్వరూ లేరు.

ఇంకా అనేక మంది జిల్లాస్థాయి అధికారులు బిఆర్ యస్ నేతల తో అంటకాగుతున్నారు రెవెన్యూ పోలీసు, మున్సిపల్, పంచాయితీ రాజు శాఖల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతలు కనీసం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉంది.ఈ శాఖల్లో ఇంకా బిఆర్ యస్ ద్వితీయ శ్రేణి నేతల హవా నే ఉంది బాన్స్ వాడ సెగ్మెంట్ లో ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధిపత్యం పోచారం ఎంట్రీ గండి పడింది.

పోచారం సిఫార్స్ చేసిన వారికే అధికారులు స్వయం ఉపాధి పనులు కేటాయిస్తున్నారు.దీనితో బిఆర్ యస్ పోచారం వెంట కాంగ్రెస్ లో వచ్చిన వారికే పనులు దక్కుతున్నాయి. రవీందర్ రెడ్డి వర్గీయులకు సైతం పనులు ఇవ్వాలని ఇంచార్జ్ మంత్రి చెప్పిన అధికారులు ఖాతరు చేయడం లేదు.

దీనితో పనులు దక్కలేదని ఓ కార్యకర్త మనస్థాపం తో మృతి చెందడం తో అదే మృతదేహంతో కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. జడ్పి మున్సిపల్ శాఖల్లో పాలక మండళ్ల పదవీ కాలం పూర్తీ అయింది. స్పెషల్ ఆఫీసర్ లు నియామకం అయ్యారు కీలక మైన ఈ శాఖల్లో ప్రగతి పనుల పురోగతి ని కనీసం రివ్యూ చేసే వారే లేరు .

మొన్నటి దాక చక్రం తిప్పిన గులాబీ బ్యాచే ఇంకా పెత్తనం సాగిస్తుంది. కీలక శాఖ లో జిల్లాస్థాయి అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతిధుల ప్రమేయం లేకుండానే వచ్చేస్తున్నారు. అందుకే వారు అధికార పార్టీ నేతలు చెప్పే పనుల ను చేయడానికి ససేమిరా అంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments