జిల్లా పోలీసు న్యాయ శాఖ చరిత్ర లోనే మొదటి సారిగా ఏసీబీ ఏకంగా కోర్టు లోనే లంచం కేసులో కానిస్టేబుల్ తో పాటు ఎపిపి రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది.
ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కోర్టు లోకి వచ్చి ఎలా పట్టుకుంటారంటూ ఆందోళన చేసిన న్యాయవాదులకు ఏసీబీ కి ఉన్న అదికారాలు అలాగే వారి వద్ద ఉన్న వీడియో ఆధారాలు తెలిసి వెనక్కి తగ్గారు.
పోలీస్ న్యాయ శాఖలను ఈ ఉదంతం కుదిపేసింది. ఓ రకంగా ఏసీబీ అదే పనిగా పోలీస్ శాఖ వెంటాడుతుంది. వరుస కేసులతో ఆ శాఖ ప్రతిష్ట మసక బారుతుంది. ఇప్పటికైన పోలీసు బాస్ లు కనువిప్పు తెచ్చుకోవాలి దిద్దుబాటు చర్యలకు సిద్ధం అవ్వాలి.
అసలు కోర్టు ల్లో విధులు అంటేనే రెండు చేతులా కూడబెట్టచ్చు అనే ఆశ కానిస్టేబుల్లో బలంగా ఉంది. అందుకే ఏళ్ల తరబడిగా కోర్టు విధుల నుంచి బయటికి రావడానికి కానిస్టేబుళ్లు ససేమిరా అంటారు.
కోర్ట్ విధుల్లో కానిస్టేబుళ్ల వసూళ్ల దందా ను పనిచేసి వెళ్లిన ఓ న్యాయ మూర్తి ద్వార ఉప్పందుకున్న గత సీపీ కల్మేశ్వర్ వారి మీద నిఘా పెట్టారు కీలక కేసుల్లో కోర్టు కానిస్టేబుళ్లు ఎలా నీరుగార్చేస్తుంది పసిగట్టారు.
అందుకే కఠిన చర్యలకు సిద్ధం అయ్యారు. ఏళ్ల తరబడిగా వుంటూ ముదుర్లుగా ఉన్న వారిని మూకుమ్మడిగా బదిలీ చేసారు. నిజానికి ఇంత మంది అదికూడా కోర్టుల్లో ఉన్నవారినే లక్ష్యంగా చేసుకొని బదిలీ లు చేసారు. ఈ ఉత్తర్వ్యూలు కోర్టు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లలో వణుకు పుట్టింది.
తదుపరి చర్యలు కూడా ఉండబోతున్నాయంటూ మొదలైన ప్రచారం తో వారంతా కలవర పడ్డారు. ఆ ఒక్కో పోలీస్ స్టేషన్ నుంచి ఒకరు లేదా ఇద్దరు కానిస్టేబుళ్ల కు కోర్టు బాధ్యతలుంటాయి.
ఆయా కేసుల్లో విచారణ లు ?వాయిదా ?నిందితులు బాధితులు సాక్ష్యులు క్రమం తప్పకుండ విచారణలకు వచ్చేలా చూస్తారు. ఈ విధుల్లో భాగంగానే కోర్టు లో ఉండే పిపి లు ఏపీపీ జిపి ఏజిపి లతో బలమైన దోస్తాని ఏర్పాటు అవుతుంది. కొందరు కానిస్టేబుళ్లు కోర్టు ల్లో కీలక వ్యక్తులతో రెగ్యులర్ గా టచ్ లో వుంటారు.
కోర్టు విధుల్లో ఉన్న వారికి రెగ్యులర్ డ్యూటీ లు వుండవు. స్టేషన్ అధికారులు సైతం వీరు విషయం లో పెద్దగా ఫోకస్ పెట్టారు. అదే అదనుగా భావించే కోర్టు విధుల్లో ఉండే కానిస్టేబుళ్లు వసూళ్ల దందా లకు ఎగబడడం మొదలు పెట్టారు. కీలక కేసుల్లో జోక్యం చేసుకోవడం ? నిందితులపక్షాన కేసు వెళ్లేలా చక్రం తిప్పడం కోరిన విధంగా వాయిదా లు ఇవ్వడం లాంటి వ్యవహారాల్లో నిష్ణాతులు గా మారారు.
అసలు కోర్టు బాధ్యతలంటేనే కానిస్టేబుళ్లు పోటీ పడుతారు. అంత సులువుగా అవకాశం దక్కదు. ఒక్కసారి ఆ విధులు దక్కితే అంత సులువుగా అక్కడి నుంచి బయటికి రారు. కల్మేశ్వర్ చేసిన బదిలీ ల్లో అదే జరిగింది ఆయన జిల్లాలో ఎవరికి మాట లెక్క చేయలేదు కదా ? కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించడానికి కొంత సమయం అడిగారు .
కానీ ఈలోపు సీపీ బదిలీ అయ్యారు కానీ కొత్త సీపీ నియామకం జరగలేదు. ఇంకేముంది మహా ముదుర్లు కదా తమ బదిలీ లను రద్దు కానిస్టేబుళ్లు చక్రం తిప్పారు ఇందుకు అధికార పార్టీ నేతలు చివరికి లా ఆఫీసర్లను సైతం రంగంలోకి దించారు. బదిలీ అయినా కానిస్టేబుళ్లు బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారా ? లేదా ?అనేది ఎవరూ పట్టించుకోలేదు.
బదిలీ అయినా వారిలో కొందరు యధావిధిగా కోర్టు ల్లో కనిపిస్తున్నారు. చీటింగ్ కేసు ను క్లోజ్ చేయించడానికి ఏకంగా నిందితుడి తో కామారెడ్డి కోర్టు కానిస్టేబుల్ ఏపిపి తో కలసి డీల్ చేసుకున్న ఉదంతం పోలీస్ అధికారులకు కేసు స్టడీ కానుంది.సదరు కానిస్టేబుల్ ఏకంగా కోర్టు ఆవరణలో నే ఏపిపి గదిలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు.
ఈ ఘటన పోలీస్ న్యాయ శాఖల్లో తీవ్ర కలకలం రేపింది. కీలక కేసుల విచారణలను కోర్ట్ కానిస్టేబుళ్లు ఎలా నీరుగార్చుతున్నారో ఏసీబీ పక్కగా బట్టబయలు చేసింది.