ఎర్ర బాపు హత్య న్యాయవాద వృత్తి , న్యాయవ్యస్థల పట్ల చేసిన క్రూరమై నేర చర్యగా జగన్ పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందించే న్యాయవాదులు ఇలాంటి దాడులకు గురి కావడం ఆందోళన కలిగిస్తున్నదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.హత్య సంఘటనపై త్వరితగతిన నేర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎర్రబాపు కుటుంబానికి న్యాయవాద సమాజం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.హత్యకు పాల్పడిన హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టి చట్ట ప్రకారం శిక్షించే వరకు విశ్రమించబోమని జగన్ పేర్కొన్నారు
