నిజామాబాద్ నగరంలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒకటవ టౌన్ పరిధిలోని వీక్లీ మార్కెట్ లోనీ శ్రీ సాయి కిరణ్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆద్వర్యంలో దాడి నిర్వహించి 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దాని విలువ సుమారు రూ లక్ష వరకు ఉంటుందని తెలిపారు.తదుపరి చర్యలు నిమిత్తం ఒకటవ టౌన్ లో అప్పగించినట్లు పేర్కొన్నారు.
