మూడు దశాబ్దాల తర్వాత నగరంలో పైప్ లైన్ లీకేజి బెడద మొదలయ్యింది. చాల కాలం తర్వాత నగరంలో ఏకంగా రెండు రోజుల పాటు మంచినీటి సరఫరాను నిలిపి వేశారు.
అధికారికంగా ఈ సమస్య మొదటి ప్రస్తవన కు వచ్చిన ప్పటికి గత కొద్దీ రోజులుగా నగరంలో ప్రధాన పైప్ లైన్ కు తరుచు లీకేజీ లు ఏర్పడుతున్నాయి.
మిషన్ భగీరథ తో స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నామని తెలంగాణ సర్కార్ అమృత్ పథకం తో తాగునీటి అవసరాల తీర్చేసామని కేంద్రం ప్రభుత్వం తరుచు ఉదరగొడుతుంది.
తాగునీటి పథకాల కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించి నట్లు గణాంకాలు చెప్తున్నాయి. నిర్వహణ కోసం ప్రతియేటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
అయిన జిల్లా కేంద్రంలోనే తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగానే ఉంది. నగరం నాలుగు వైపుల శరవేగంగా విస్తరించింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అందుకు తగ్గట్టుగా ప్రజలు మౌళిక సౌకర్యాలు కల్పించలేక పోతుంది.
మారుమూల ప్రాంతాల్లోనే తాగునీటి ఇంటింటికి సరఫరా చేస్తున్నామని గప్పాలు కొడ్తున్న పాలకులు జిల్లా కేంద్రంలోనే అనేక ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయలేక పోతుంది.
అసలు ప్రధాన ప్రాంతాల్లోనే పైపు లైన్ వ్యవస్థ గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. గతంలో డీఎస్ మొదటి సారి మంత్రి అయ్యాక నగరంలో ప్రధాన ప్రాంతాల్లో పైప్ లైన్ ను మార్చేశారు.
దీనితో కొన్నేళ్ల పాటు లీకేజ్ ల బెడద తగ్గింది. మళ్ళీ మూడు దశాబ్దాల తరవాత లీకేజి బెడద నగరంలో తాగునీటి సరఫరా ఫై తీవ్ర ప్రభావం ను చూపుతుంది నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు నీటి సరఫరా కలుగుతుందని జిల్లా మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు .
నగరంలోని అలీ సాగర్ మెయిన్ పైప్ లైన్ లీకేజీ కారణంగా తాగునీటి సరఫరా అత్యవసరంగా నిలిపి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. లతీఫ్ కాలని,డైరీ ఫారం, లాల్బాగ్, హతాయి గల్లి, ఆనంద నగర్,నాల్కల్ రోడ్డు, నాగారం,వడ్డెర కాలనీ, గంగస్తాన్, పంచాయతీరాజ్ కాలనీ, ఆటోనగర్,మాలపల్లి, దయానంద్ నగర్, ధర్మపురి హిల్స్, మిర్చి
కాంపౌండ్, శాంతినగర్, నిజాం కాలనీ, 300 కోటర్స్,వెంగళరావు నగర్, స్లాటర్ హౌస్ ఏరియా, మహాలక్ష్మి నగర్, వినాయక్ నగర్, లో 7వ తేదిన అంతరాయం ఏర్పడుతుంది. అలాగే 8వ తేదిన సుభాష్ నగర్, నాందేవాడ అర్బన్ హాస్పిటల్, గౌతమ్ నగర్, గోల్ హనుమాన్,
కోటగల్లి, ఖిల్లా గుట్ట బడ బజార్,కంటేశ్వర్, తిలక్ గార్డెన్, ఎల్లమ్మ గుట్ట, పోలీస్ లైన్, ప్రగతి నగర్, ఆటో నగర్, మిర్చి కాంపౌండ్,మాలపల్లి, వినాయక నగర్, లో నీటి సరఫరాకు అంతరం కలుగుతుందని ఆయా ప్రాంతాల్లో 17 వాటర్ ట్యాంకర్ లతో నీటి సరఫరా చేస్తున్నారు.