HomePOLITICAL NEWSUncategorizedఅత్త గొలుసు మాయం చేసిన అల్లుడు…నిందితుడినీ పట్టుకొని అరెస్టు చేసిన పోలిసులు .

అత్త గొలుసు మాయం చేసిన అల్లుడు…నిందితుడినీ పట్టుకొని అరెస్టు చేసిన పోలిసులు .

స్వంత అల్లుడు, అత్త ఇంట్లో లేని సమయంలో చొరబడి బంగారం ఆభరణాలు చోరి చేశాడు. ఈ ఘటనలో నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఎట్టకేలకు పోలిసులు చోరి కేసు ఛేదించి అల్లుడిని అరెస్టు చేసినట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. నాలుగవ టౌన్ పరిధిలోనీ రోటరీ క్లబ్ కాలనీలో నివాసముంటున్న సభవత్ సక్కుబాయి ఈ నెల 9 న కామారెడ్డి ఆసుపత్రి లో ఉన్న బందువులని పరామర్శించడానికి వెళ్ళారు.

ఈ మేరకు పక్కనే ఉంటున్న కూతురిని ఇంటి వైపు చూడమని చెప్పి వెళ్లిందని తెలిపారు.అదే అదునుగా భావించిన అల్లుడు ధరవత్ సంతోష్ ఇంట్లొకి చొరబడి ఇంట్లోని సుమారు బంగారు ఆభరణాలు అపహారించినట్లు తెలిపారు.

అదే రోజు మధ్యాహ్నం కామారెడ్డి నుంచి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తులన్ని గందరలోగంగా పడి ఉండడంతో ఇంట్లొకి వెళ్లి చేసేసరికి బంగారు పెద్ద గులుసు,నెక్సెస్ ఆభరణాలు కనిపించకపోవడంతో నాలుగవ టౌన్ లో ఫిర్యాధు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తులో బాగంగా సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నేరస్తుడైన ఫిర్యాది సొంత అల్లుడు ధరావత్ సంతోష్ ను అదుపులోకి తీసుకోని విచారించారు.

విచారణలో దొంగతనం నేరం చేసినట్లు సంతోష్ ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి సుమారు 8తులాల బంగారు నగలను స్వాదీనo చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టు నందు హాజరు పరచినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments