యూనివర్సిటీ లో అక్రమ నియామకాల పంచాయితీ ని అధికార పార్టీ చెంత కు చేర్చారు. కోర్టు తీర్పు ఫై తదుపరి చర్యలు చేపట్టాల్సిన యూనివర్సిటీ అధికారలు బరి తెగింపు ధోరణి తో వ్యవహరిస్తున్నారు.
అధికార పార్టీ అగ్ర నేతల మధ్య సమన్వయం లేక పోవడాన్ని అధికారులు తమ అక్రమ దందా లకు అనువుగా మార్చుకుంటున్నారు. తాము చేసి అక్రమాలు వెలుగు లో రాకుండా అధికార పార్టీ ని వాడుకుంటున్నారు. అన్నట్లుగానే జిల్లాకు చెందిన అగ్ర నేతలు తమకేమి సోయి లేనట్లుగా ఉంటున్నారు.
అక్రమ నియామకాల కు అధికార ముద్ర పడేలా యూనివర్సిటీ కి చెందిన అధికారి తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. 2012 లో జరిగిన నియామకాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఫై తదుపరి చర్యల మీద యునివర్సిటీ అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
విద్యార్థి సంఘాలు గట్టిగా నిలదీస్తే ఉల్టా దబాయిస్తున్నారు ఎహే అన్నీ విషయాలు అధికార పార్టీ పెద్దలకు పూస గుచ్చి నట్లుగా చెపుతున్నాం అంటూ వీసీ నిస్సిగ్గుగా విద్యార్థి నేతలకు చెప్తున్నారు .
అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతి నిధి ని ఇందులో ఇన్వాల్ చేసారు. హైకోర్టు తీర్పు ఇప్పటికిప్పుడే అమల్లో కి రాకుండా బాధిత ఉద్యోగులకు అభయ హస్తం ఇస్తున్నట్లు సమాచారం. మరో వైపు తమ ఉద్యోగాల తొలగింపు ను సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ కు వెళ్ళడానికి బాధితులు సన్నాహాలు చేస్తున్నారు.
డివిజన్ బెంచ్ ను ఆశ్రయించ నున్నారు. తదుపరి తీర్పు వచ్చేదికా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద స్టే వస్తుందనే ధీమాలో వారున్నారు.అప్పటిదాకా యునివర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త లు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా కీలక మైన విద్యార్థి సంఘాల నేతల తో బేరసారాలు సైతం మొదలు పెట్టారు.నిజానికి హైకోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి తాజా గా నోటిఫికేషన్ ఇవ్వాలి దీనితో చాల మంది ఔత్సహిక యువత కు ఉద్యోగ అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.
కానీ గతంలో దొడ్డి దారిలో రోస్టర్ నియమావళి తుంగ లో తొక్కేశారు. ఎంతో మంది అర్హులైన వారు ఉన్నాసరే నిబంధనలు పాతరేసి నియామకాలు చెప్పట్టారు. అందుకే తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో సీఎంవో సైతం రంగంలోకి దిగింది.
అయినప్పటికి యునివర్సిటీ అధికారుల బరితెగించడం తో అర్హులైన అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు 2013 లో దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ బీమాపక నగేష్ ధర్మాసనం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. 2012 లో అప్పటి వైస్ ఛాన్స్ లర్ అక్బరోద్దిన్ యూనివర్సిటి లో నియామకాలు చేపట్టారు.
నియామకాలు భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ పిర్యాదు లు వెల్లువెత్తాయి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దాక వెళ్లాయి కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు అయినప్పటికి అభ్యర్థులకు నియామకం ఉత్తర్వ్యూలు ఇచ్చారు.
దీనితో నియామకాల ను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ వాదనలు జరిగాయి. నియామకాల్లో రోస్టర్ పాటించలేదని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిబంధనలు తొక్కేశారని పిర్యాదు లు వెల్లు వెత్తాయి.
