కన్న తండ్రిని హత్య చేసి ఆ పై అనారోగ్యంతో మృతి చెందినట్లు ఓ తనయుడు చిత్రీకరించిన ఘటన నవిపేట్ మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..మండలంలోని అనంతగిరి కి చెందిన గౌరు మహిపాల్ తన తండ్రి అయిన గౌరు అమృతం(55) ను టవల్ తో మెడకు బిగించి హత్య చేసినట్లు తెలిపారు.గౌరు మహిపాల్ ఇటీవల దుబాయ్ నుంచి తన తండ్రి మృతి చెందారు అనే కారణం చెప్పి ఇండియాకు తిరిగి వచ్చారు.
ఈ మేరకు గౌరు మహిపాల్ తన తండ్రి అయిన గౌరు అమృతం వద్దనే ఉంటున్నారు. ఆదివారం రాత్రి తండ్రి,కుమారుడు కలిసి ఇంట్లోనే మద్యం సేవించారు. మద్యం మత్తులో తండ్రి అయిన గౌరు అమృతం ను టవల్ తో మెడకు చుట్టూ హత్య చేశాడు. సోమవారం గ్రామస్థులకు నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పి గ్రామంలోని ఆర్ఎంపి డాక్టర్ కు చూపించిన ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు చిత్రీకరించాడు.
అనంతరం దహన సంస్కారాలు నిర్వహించే క్రమంలో సోదరి తన తండ్రి మెడకు ఉన్న గాయాలను చూడగా అసలు విషయం బయటపడింది. గత కొన్ని రోజులుగా తండ్రి తో పాత కక్షలు కారణంగా హత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
