HomeCRIMEప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య...

ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య…

ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…

మండలంలోని సిర్నపల్లికి చెందిన అజయ్ (21) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసుకున్నాడు ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఓ యువతిని ప్రేమించాడు.

దాంతో యువతి ప్రమకు నిరాకరించిందని తీవ్ర మస్థాపానికి గురై ఈనెల 10 పురుగుల మందు సేవించి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపకుండ ఫుడ్ పాయిజన్ అవుతుందని తెలిపి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

అయినా ఆరోగ్యం నిలకడ లేదని నిజామాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి క్రమంలో యువకుడి ఫోన్ చూడగా పురుగుల మందు సేవింస్తూ తీసిన వీడియో లభ్యం కావడం తో హుటాహుటిన నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు.

చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments