ఇందల్వాయి మండలంలోని తిర్మన్ పల్లి గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబ పెద్ద అనారోగ్యంతో నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనతో పాటు భార్య కూడా అక్కడే ఉన్నారు. ఇదే సమయంలో వారి కుమారుడు, కోడలు తమ నివాసానికి తిరిగి వచ్చి బుధవారం రాత్రి నిద్రించారు.
ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు తల్లిదండ్రులు ఉంటున్న పాత ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న సుమారు తులంన్నర బంగారు ఆభరణాలను అపహరించినట్లు స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ ఆధారంగా వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
