మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో పూర్తి చేసేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ శసాయి చైతన్య, స్పష్టం చేశారు. ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా జరుగనున్న ఈ ఎన్నికల కోసం మొత్తం 1,100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు.
ఆర్మూర్ లోని 12 మండలాలు:
గ్రామ పంచాయతీలు: 148
పోలింగ్ స్టేషన్లు: 1,496
ఓటర్లు: 3,26,029 ఉన్నారని తెలిపారు.
అందుకోసం పోలీస్ శాఖ చేపట్టిన కీలక ముందస్తు చర్యలను వివరించారు. ముఖ్యంగా, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పోతంగల్, సాలూర, ఖండ్గావ్‌లలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, 24/7 వాహన తనిఖీలను, నిర్విరామ నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని 60 సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు.
ఎన్నికల వ్యయాన్ని, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు 24 ఎఫ్.ఎస్.టీ (ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్), 4 ఎస్.ఎస్.టీ (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్) బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.ఆర్మూర్ డివిజన్ పరిధిలో బైండోవర్ లు మొత్తము 194 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగింది.
. ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై 2 కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కమర్ పల్లి , నందిపేట్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 18 మంది వద్ద గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా 11 డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 7 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినది గలవు.
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి…
ఎన్నికల నేపథ్యంలో ఎవరూ కూడా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని సీపీ గట్టిగా హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 163 బి.ఎన్.ఎస్.ఎస్. చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
గతంలో మొదటి విడత ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించినందుకు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టానాకలన్ గ్రామంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠమైన నిఘా వ్యవస్థతో ఎన్నికల ప్ర
