జీజీహెచ్‌లో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం…నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే మాక్లూర్ మండలం మానికభేండార్ మహాలక్ష్మి కాలోనికి చెందిన సాయినాథ్ తన భార్య సాయిమతిని డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి మూడు రోజుల క్రితం తీసుకొచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తల్లి మూడేళ్ల బాలుడు అరుణ్‌తో కలిసి ఆస్పత్రిలోని కారిడార్‌లో పడుకున్నారు.
సదరు తండ్రి తన కుమారుడిని కలిసి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది గమనించిన దుండగులు రాత్రి సుమారు మూడున్నర ప్రాంతాల్లో తండ్రి పక్కలో నుంచి తీసుకెళ్లిపోయారు.
సదరు తండ్రి మేల్కొని చూసే సరికి అరుణ్ కనిపించకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రి ఆవరణలో గాలించినా ఫలితం లేకపోయింది.
ఈ మేరకు కిడ్నాప్ ఐనట్టు గురైనట్లు గ్రహించి తండ్రి ఆసుపత్రి డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఒకటో టౌన్ పోలీసులులకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఆసుపత్రిలోని సీసీటీవీ దశ్యాలను పరిశీలించారు.
ఇద్దరు వ్యక్తులు కలిసి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.