ఆసుపత్రి లో లోపల ఉండే సిబ్బంది ….వారికి తోడుగా ఉండే ప్రైవేట్ సెక్యూరిటీ ఆసుపత్రి ఆవరణలో పహారా కాసే లోకల్ పోలీసులు గేట్ వద్ద స్పెషల్ పోలీస్ పైకి చూడడానికి ఎంతో కట్టుదిట్టంగా ఉండే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో వీరందరి కళ్ళు గప్పి ఓ ఆగంతకుడు గాఢ నిద్ర లో ఉన్న మూడేళ్ల బాలుడుని ఎత్తుకెళ్లిన ఘటన నగరంలో కలకలం రేపింది.
ఆసుపత్రి లో భద్రతా వైఫల్యాలను మరోసారి ఎత్తుచూపింది. ఇలాంటి ఘటనలు గతంలో జరిగినా గుణపాఠం నేర్వని ఫలితం మరో తల్లి గుండె తల్లడిల్లేలా చేసింది. బాలుడి ని ఆసుపత్రి నుంచి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ లో స్పష్టంగా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
బాలుడిని ఎత్తుకెళ్లిన వ్యక్తి ని గుర్తించే పనిలో పడ్డారు.మాణిక్ బండారు గ్రామానికి చెందిన డెలివరీ కోసం భర్త సాయి నాథ్ తో పాటు కొడుకు అరుణ్ ( 3 ) లతో కలసి మూడు రోజుల క్రితం వచ్చి జాయిన్ అయ్యింది. కొడుకు అరుణ్ తో కలసి సాయి నాథ్ ఆసుపత్రి కారిడార్ లోనే నిద్ర పోతున్నాడు.
కానీ అది గమనించిన వారే శనివారం తెల్లవారు జామున అరుణ్ ను తండ్రి పక్కలో నుంచి ఎత్తుకెళ్లారు.ఆసుపత్రిలో అటెండర్లు వార్డు బాయ్ లతో హడావుడి గా వుంటుంది.
ఇదే ఆసుపత్రి లో గ్రౌండ్ ఫ్లోర్ లో నే పోలీసు ఔట్ పోస్టు కూడా ఉంది .అందులోనూ 24 గంటల విధుల్లో కానిస్టేబుళ్లు వుంటారు. వీరు కాకుండా ఆసుపత్రిలోపల ప్రైవేట్ సెక్యూరిటీ అన్నీ విభాగాల్లో ను ఉంది.
అయినప్పటికి గుర్తు తెలియని వ్యక్తులు పక్కా ప్లాన్ తో అరుణ్ దర్జాగా ఎత్తుకెళ్లారు. అదీగాక ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద స్పెషల్ పోలీసు బలగాలు సైతం వుంటాయి.
వీరందరిని దాటుకొని అదికూడా మూడేళ్ళ బాలుడు ఆసుపత్రి నుంచి కిడ్నప్ కావడం ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. ఈ ఘటన వెనుక ఎవరెవరి ప్రమేయం వుందనేది పోలీసులు అరా తీస్తున్నారు.