కూకట్పల్లి లో (ఆదివారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.. ఆదివారం మహేశ్ (17), లక్ష్మీ తేజ (17)తో పాటు మరో యువకుడు స్కూటీపై క్రికెట్ ఆడేందుకువెళ్తున్నారు .
ఈ క్రమంలో ఓ టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది.ప్రమాదంలో మహేశ్, లక్ష్మీ తేజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
