Friday, May 1, 2026
HomeTelanganaNizamabadటీఎన్జీవో జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజుకు ఘన సన్మానం..

టీఎన్జీవో జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజుకు ఘన సన్మానం..

టీఎన్జీవో జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ పెద్దొళ్ల నాగరాజును శుక్రవారం బిసి ఉపాధ్యాయ సంఘం (బిసిటియు) నాయకులు ఘనంగా సన్మానించారు. మెడికల్ కళాశాల ప్రాంగణంలో బిసిటియు జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నాగరాజుకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నాగరాజు ఉద్యోగుల పక్షాన నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడిగా ఆయన సేవలు ఉద్యోగ లోకానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. కృష్ణ మోహన్, బిసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షుడు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ పాల్గొన్నారు.

అలాగే గౌరవ సలహాదారులు రమణ స్వామి, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షుడు గంగోనె సంజీవ్, నాయకులు సుమన్, రవిచంద్ర తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!