నగరంలో రోడ్డుపై గుంతలు తవ్వి వదిలి వేసిన మట్టిని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిని తొలగించారు.
నిజామాబాదు నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద కేబుల్ వేయడానికి గుంత తవ్వి రోడ్ పైన మట్టిని వదిలివేయగా అట్టి మట్టి రోడ్డు పైన ఉండడం వలన ట్రాఫిక్ కి అసౌకర్యం కలుగగా విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కిరణ్, రాజసాగర్, గోపాల్, దినేష్ లు స్వయంగా పరాలతో మట్టిని తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేశారు.
ట్రాఫిక్ పోలిస్ వారు చేసిన మంచి పనికి నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేసినారు.
