గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు సీపీ సూచనలు మండపాలను విద్యుత్ లైన్ల క్రింద లేదా విద్యుత్ లైన్లకు/ట్రాన్స్‌ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయకూడదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
మండపాలలో ఈఎల్ సిబి(Earth Leakage Circuit Breaker) మరియు అవసరమైన ఎమ్ సి బి సి ఏర్పాటు చేయాలను అన్నారు.
మండపాల వైరింగ్‌ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలి.వైరింగ్‌లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలనీ సూచించారు.కనెక్ట్ అయిన లోడుకు సరిపోయే రేటెడ్ కేబుల్ వైర్లు, సరైన ఇన్సులేషన్‌తో ఉపయోగించాలి.సర్వీస్ కేబుల్స్ హుకింగ్ చేయరాదు.విద్యుత్ వైర్లు ఇనుప పైపులకు తగలకుండా చూడాలి.
అవసరమైతే తగిన ఇన్సులేషన్ పెట్టాలి. వైర్లు నేలమీద వేయరాదు.తప్పనిసరిగా వేయాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ తెలిపారు.
మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే వాటిని ఇన్సులేషన్ పదార్థంతో కవర్ చేయాలని,సర్వీస్ వైరు పోలుకు ఫిక్స్ చేసిన తర్వాత, సంబంధిత లైన్‌మన్ లేదా జే ఎల్ ఎం అనుమతి లేకుండా మార్పులు చేయవద్దని తెలిపారు.కావున గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా పై సూచనలు పాటించాలని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
