నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మరమ్మతులకు ప్రభుత్వం రూ 2.76 కోట్ల నిధులు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా డిసెంబరులో జీజీహెచ్ ను సందర్శించారు. డ్రైనేజీ లీకేజీలు, భవనం గోడలపై మురుగు పారటం చూశారు.
కిటికీల అద్దాలు పగిపోయి, గోడలపై మొక్కలు పెరగడం చూసిన అప్పట్లోనే మరమ్మతులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్ లు మరమ్మతులకు పలు మార్లు ప్రతిపాదనలు పంపారు
ఎట్టకేలకు ఎనిమిది నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు చేసింది. దీంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదుపాయాల కల్పనపై కసరత్తులు చేస్తున్నారు.
నిజామాబాద్ ఇంచార్జి మంత్రి సీతక్క సమీక్షా సమావేశంలో పలువురు ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి పై చర్చలు జరిపారు. ఎట్టకేలకు 750 పడకలతో రోగులకు సేవలందిస్తున్న జీజీహెచ్ లో సమస్యల పరిష్కారానికి కొన్ని నిధులు వెచ్చించారు.
ఆసుపత్రిలో మరుగుదొడ్లు, మురుగునీటి వ్యవస్థకు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం,పగిలిన అద్దాల స్థానంలో నూతన అద్దాలను ఏర్పాటు చేయాలని,అలాగే టీ హబ్ ను విస్తరణకు, అలాగే టీబీ కోసం జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేయాలని, తదితర పనుల కోసం ప్రభుత్య నుంచి రూ 2.76 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో త్వరలోనే అన్నింటికి టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.
