నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సోమవారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 15,307 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 2,100 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 15,482 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.499 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
