HomeCRIMEకుప్పకూలిన నిర్మాణం లో ఉన్న భవనం ఇద్దరు మృతి

కుప్పకూలిన నిర్మాణం లో ఉన్న భవనం ఇద్దరు మృతి

నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన గచ్చిబౌలి లోని అంజయ్యనగర్ . శనివారం మధ్యాహ్నం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. భవనం శిథిలాల నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు.

మరొకరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరికొందరు వర్కర్లు, స్థానికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. భారీ భవనం కావడంతో.. శిథిలాలను తొలగించేందుకు సమయం పడుతుందని, రెస్క్యూ పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

శిథిలాల కింద చిక్కుకున్నవారిని క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.కేవలం 60 గజల్లో నే ఏకంగా ఏడు అంతస్థుల భవనం నిర్మాణం జరుగుతుంది.

ప్రధాన ఏరియా లో ఎలాంటి అనుమతి లేకుండా ఇంత భారీ నిర్మాణం జరుగుతుంటే అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments