లారీని ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ నగర శివారులోని శ్రీనగర్ గజానంద్ రైస్ మిల్ల వద్ద నిజామాబాద్ దుబ్బ నుంచి మాక్లూర్ చిక్లీ వెలుతున్న కారు లారీని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో మృతి చెందిన యువకుడు మాక్లూర్ మండలం చిక్లి గ్రామానికి చెందిన దండ్ల వంశీ (17 ) అక్కడి కక్కడే మృతి చెందాడు.అలాగే అతని స్నేహితుడు రాజేష్ (18 )లు అక్కడే చనిపోయాడు.
మరో యువకునికి తీవ్ర గాయాలు అవడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం మీకు పోలీసులు హోటహవుతున్న ఘటన స్థానాలకు చేరుకొని కారులో నుంచి మృతదేహాలు బయటకి తీసినట్లు పేర్కొన్నారు.